Appagimpabadina raatri song lyrics :
అప్పగింపబడిన రాత్రి
చెప్ప సాగే శిష్యులతో ||2||
చెప్పరాని దుఃఖముతో
తప్పదు నాకీ మరణమనెను ||2|| ||అప్పగింప||
1. రొట్టె విరచి ప్రార్ధించి
నిట్టూర్పు విడచి ఇది నా దేహం ||2||
పట్టుదలతో నేనొచ్చుఁ వరకు
ఇట్టులనే భుజించుడనెను ||2|| ||అప్పగింప||
2. ద్రాక్షా రస గిన్నెను చాపి
వీక్షించుడిదియే నా రక్తం ||2||
రక్షణార్థం దీని త్రాగి
మోక్ష రాజ్యం చేరుడనెను ||2|| ||అప్పగింప||
3. రాతివేత దూరాన
చేతులెత్తి ప్రభు మోకరించి ||2||
నా తండ్రి నీ చిత్తమైతే
ఈ పాత్రన్ తీసి వేయుమనెను ||2|| ||అప్పగింప||
4. ఇదిగో వచ్చె తుది ఘడియ
హృదయ బాధ హెచ్చెను ||2||
పదిలపరచు-నట్లు తండ్రిన్
మదిలో వదలక ప్రార్ధించుడనెను ||2|| ||అప్పగింప||