Anthaa Naa Meluke song lyrics:
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2)
అంతా నా మేలుకే – ఆరాధన యేసుకే
అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే
తన చిత్తమునకు తల వంచితే
ఆరాధన ఆపను – స్తుతియించుట మానను (2)
స్తుతియించుట మానను
1. కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనా
స్థితి గతులే మారినా – అవకాశం చేజారినా(2)
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ(2)
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ(2) ||అంతా||
2. ఆస్తులన్ని కోల్పోయినా – కన్నవారే కనుమరుగైనా
ఊపిరి భరువైనా – గుండెలే పగిలినా(2)
యెహోవా ఇచ్చెను – యెహోవా తీసుకొనెను(2)
ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక(2) ||అంతా||
3. అవమానం ఎంతైనా – నా వారే కాదన్నా
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున(2)
నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు(2)
నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు(2) ||అంతా||
4. ఆశలే సమాధియైనా – వ్యాధి బాధ వెల్లువైనా
అధికారం కొప్పుకొని – రక్షణకై ఆనందింతును(2)
నాదు మనస్సు నీ మీద – ఆనుకొనగా ఓ నాథా(2)
పూర్ణ శాంతి నే పొంది – నిన్నే నే కీర్తింతున్(2) ||అంతా||
5. చదువులే రాకున్నా – ఓటమి పాలైనా
ఉద్యోగం లేకున్నా – భూమికే భరువైనా(2)
నా యెడల నీ తలంపులు – ఎంతో ప్రియములు(2)
నీవుద్దేశించినది – నిశ్ఫలము కానేరదు(2) ||అంతా||
6. సంకల్పన పిలుపొంది – నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి – మేలుకై జరుగును(2)
యేసుని సారూప్యము – నేను పొందాలని(2)
అనుమతించిన ఈ – విలువైన సిలువకై(2) ||అంతా||
7. నీవు చేయునది – నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను – తెలిసికొందును(2)
ప్రస్తుతము సమస్తము – దుఃఖ కరమే(2)
అభ్యసించిన నీతి – సమాధాన ఫలమే(2) ||అంతా||
For Video song Click here: Anthaa Naa Meluke – అంతా నా మేలుకే
Anthaa Naa Meluke
Praise the Lord brother you sang a beautiful ful it chainged many lives in the name of Jesus
My name is Mahima And l like it Jeasus Very much
వందనాలు సిస్టర్ గారూ 🙏
Super song good bless u bro…….
praise the LORD brother song is very nice good melody all instruments are performed All mighty God has given u a great song we are making our church choir to learn the song to sing in the sunday service as a choir director and flutist .pray for me and my family
Praise the lord brother. What a beautiful song ever listened me.God bless you 🙏
Meaningful song
గాడ్ బ్లెస్ యూ
Praise the Lord
Super song bro
Praise the lord Jesus is the king