Anni Namamula Kanna Ghanamaina song lyrics :
అన్ని నామముల కన్న ఘనమైన నామము నీది యేసు నాథా
అందరిని ప్రేమించు ఆదరణ కర్తవయ్యా ప్రాణ నాథా
యెహోవ ఈరే అని పిలువబడినవాడ ||2||
నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు ||2|| ||అన్ని నామముల||
1. దేవతలకన్నా దయగలవాడవు
క్షమించు మనసున్న మహారాజువు ||2||
ప్రేమామయుడవు ప్రభువగు దేవుడవు
ప్రాణము పెట్టిన ప్రభు యేసువు ||అన్ని నామముల||
2. గాలి తుఫానులను ఆపినవాడవు
నీటిపై నడచిన నిజ దేవుడవు ||2||
జానతో ఆకాశాన్ని కొలిచినవాడవు
శాంతి సమాధానం నొసగే దేవుడవు ||అన్ని నామముల||