అంచులనుండి జారేల – గిన్నెలు నిండి పోర్లేలా
ఆశీర్వదిస్తాడు యేసయ్యా (2)
విశ్వాసంతో ప్రార్ధన చేసిన – ఇచ్చేదాక ఓపిక పట్టిన (2)
మితిలేని తన సంపద నీదే – స్తుతియిస్తే పొందనిది లేదే (2)అంచుల
1. లెక్కకు మించి కురియుచున్న – అద్భుతమైన దీవేనలకై (2)
స్తోత్ర గానము చేయు చున్నావా (2)
కృతజ్ఞత కలిగున్నావా (2)మితి
2. శ్రమల నుండి అమరుచున్న – అబ్బురపరచే మేళ్ళ కొఱకై (2)
స్తోత్ర గానము చేయు చున్నావా (2)
కృతజ్ఞత కలిగున్నావా (2)మితి
3. అపాయములను తప్పిస్తున్న – అదృశ్య దేవుని కాపుదాలకై (2)
స్తోత్ర గానము చేయు చున్నావా (2)
కృతజ్ఞత కలిగున్నావా (2)మితి
I love the song