Advitheeya satya devaa song lyrics :
వందనమయ్యా వందనమయ్యా యేసు నాథా
వందనం వందనం వందనం
అద్వితీయ సత్య దేవా వందనం – వందనం
పరమ తండ్రి పావనుండా వందనం – వందనం
దివ్య పుత్రా యేసు నాథా వందనం – వందనం
పావనాత్మా శాంతి దాతా వందనం – వందనం ||2||
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ||2||
1. వ్యోమ సింహాసనుండ వందనం – వందనం
ఉర్వి పాద పీఠస్థుడ వందనం – వందనం ||2||
ఆద్యంత రహిత నీకే వందనం – వందనం
అక్షయ కరుణీక్షుండా వందనం – వందనం ||2|| ||హల్లెలూయా||
2. ప్రాణదాత యేసునాథా వందనం – వందనం
ముక్తిదాత జీవదాతా వందనం – వందనం ||2||
సిల్వధారి ప్రేమమూర్తి వందనం – వందనం
ముగ్ధ స్తోత్రార్హుండా వందనం – వందనం ||2|| ||హల్లెలూయా||