Adigo Naa naava song lyrics :
అదిగో నా నావ బయలు దేరుచున్నది
అందులో యేసు ఉన్నాడు
నా నావలో క్రీస్తు ఉన్నాడు ||2||
వరదలెన్ని వచ్చినా వణకను
అలలెన్ని వచ్చినా అదరను ||2||
ఆగిపోయే అడ్డులొచ్చినా
సాగిపోయే సహాయం మనకు ఆయనే ||2|| ||అదిగో||
నడిరాత్రి జాములో నడచినా
నది సముద్ర మధ్యలో నిలచినా ||2||
నడిపించును నా యేసు
నన్నూ అద్దరికి చేర్చును ||2|| ||అదిగో||
లోతైన దారిలో పోవుచున్నది
సుడిగుండాలెన్నో తిరుగుచున్నవి ||2||
సూర్యుడైన ఆగిపోవును
చుక్కాని మాత్రం సాగిపోవును ||2|| ||అదిగో||