Adavi Chetla Naduma song lyrics:
అడవి చెట్ల నడుమ
ఒక జల్దరు వృక్షం వలె
పరిశుద్ధుల సమాజములో
యేసు ప్రజ్వలించుచున్నాడు (2)
కీర్తింతున్ నా ప్రభుని
జీవ కాలమెల్ల ప్రభు యేసుని
కృతజ్ఞతతో స్తుతించెదను (2)
1. షారోను రోజా ఆయనే
లోయ పద్మమును ఆయనే
అతిపరిశుద్ధుడు ఆయనే
పదివేలలో అతిశ్రేష్టుడు(2) ||కీర్తింతున్||
2.పరిమళ తైలం నీ నామం
దాని వాసన వ్యాపించెగా
నింద శ్రమ సంకటంలో
నను సుగంధముగా చేయున్(2) ||కీర్తింతున్||
3.మనోవేదన సహించలేక
సిలువ వైపు నే చూడగా
లేవనెత్తి నన్నెత్తుకొని
భయపడకుమని అంటివి(2) ||కీర్తింతున్||
4.నా త్రోవకు దీపం నీవే
నా బ్రతుకుకు జీవం నీవే
నా సేవకు బలము నీవే
నా ఆత్మకాదరణ నీవే(2) ||కీర్తింతున్||
5.ఘనమైన నా ప్రభువా
నీ రక్త ప్రభావమున
నా హృదయము కడిగితివి
నీకే నా స్తుతి ఘనత(2) ||కీర్తింతున్||
6.నీవు నా దాసుడవనియు
ఏర్పరచుకొంటినని
నేనే నీ దేవుడనని
భయపడకు-మని అంటివి(2) ||కీర్తింతున్||
For Video song Click Here : Adavi Chetla Naduma – అడవి చెట్ల నడుమaaaaaaa
