Aasrayuda naa abhishikthuda song lyrics:
ఆశ్రయుడా నా అభిషిక్తుడా
నీ అభీష్టము చేత నను నడుపుచుండిన
అద్భుత నా నాయకా
యేసయ్య అద్భుత నా నాయకా
స్తోత్రములు నీకే స్తోత్రములు ||2||
తేజోమయుడయిన ఆరాధ్యుడా ||2||
1. నీ ఆలోచనలు అతి గంభీరములు
అవి ఎన్నటికీ క్షేమకరములే
మనోహరములే కృపాయుతమే ||2||
శాంతి జలములే సీయోను త్రోవలు ||2||
2. నీతి మార్గములో నన్ను నడుపుచుండగా
సూర్యుని వలె నే తేజరిల్లెదను
నీ రాజ్య మర్మములు ఎరిగిన వాడనై ||2||
జీవించెదను నీ సముఖములో ||2||
3. సువార్తకు నన్ను సాక్షిగా నిలిపితివి
ఆత్మల రక్షణ నా గురి చేసితివి
పరిశుద్ధతలో నే నడిచెదను ||2||
భళా మంచి దాసుడనై నీ సేవలో ||2||