ఆశతో నీ కొరకు ఎదురుచూచుచుండగా .
నూతన బలముతో నను నింపినావు ||2||
బలహీనులను బలపరచువాడా
కృంగిన వారిని లేవనెత్తువాడా ||2||
యేసయ్యా నా ఆశ్రయమా
యేసయ్యా నీకే ఆరాధన ||2|| ||ఆశతో||
1. సొమ్మసిల్లక అడుగులు తడబడక
నడిచెద నీ వెంట జీవితమంతా ||2||
లోకము నన్ను ఆకర్షించినా
వెనుదిరుగక నేను సాగెద నీ వెంట ||2|| ||యేసయ్యా||
2. అలయక నేను పరుగెత్తెదను
అంతము వరకు ఆత్మల రక్షణకై ||2||
సిద్ధము చేసిన బహుమానముకై
గురియొద్దకే నేను సాగెదనయ్యా ||2|| ||యేసయ్యా||
3. రెక్కలు చాపి పక్షి రాజువలెనే
పైకెగెరెద నీ పరిశుద్ధులతో ||2||
పరవశించెదను నీ ముఖమును చూచి
ప్రణమిల్లెద నీ పాదముల చెంత ||2|| ||యేసయ్యా||