Aascharyakaruda naa Song lyrics:
ఆశ్చర్యాకరుడా
నా ఆలోచన కర్తవు ||2||
నిత్యుడగు తండ్రివి
నా షాలేము రాజువు ||2||
సింహపు పిల్లలైనా
కొదువ కలిగి ఆకలిగొనినా ||2||
నీ పిల్లలు – ఆకలితో అలమటింతురా
నీవున్నంతవరకు ||2|| ||ఆశ్చర్యాకరుడా||
విత్తని పక్షులను
నిత్యము పోషించుచున్నావు ||2||
నీ పిల్లలు – వాటికంటే శ్రేష్టులే కదా
నీవున్నంతవరకు ||2|| ||ఆశ్చర్యాకరుడా||
చీకటి తొలగే
నీతి సూర్యుడు నాలో ఉదయించె ||2||
నీ సాక్షిగా – వెలుగుమయమై తేజరిల్లెదను
నీవున్నంతవరకు ||2|| ||ఆశ్చర్యాకరుడా||