Aanandame Paramaanandame Song lyrics :
ఆనందమే పరమానందమే
ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ||2||
ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన
అక్షయుడా నీకే స్తోత్రము ||2|| ||ఆనందమే||
పచ్చిక గల చోట్ల పరుండ జేసితివే
జీవ జలములు త్రాగనిచ్చితివే ||2||
నా ప్రాణమునకు సేదదీర్చితివి
నీతియు శాంతియు నాకిచ్చితివే ||2|| ||ఆనందమే||
గాఢాంధకారము లోయలలో నేను
సంచరించినా దేనికి భయపడను ||2||
నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును
అనుదినం అనుక్షణం కాపాడునే ||2|| ||ఆనందమే||
నా శత్రువుల ఎదుటే నీవు
నాకు విందును సిద్ధము చేసావు ||2||
నీతో నేను నీ మందిరములో
నివాసము చేసెద చిరకాలము ||2|| ||ఆనందమే||