Aakasamandu Neevundagaa:
ఆకాశమందు నీవుండగా
నేను ఎవరికి భయపడను
నీవీ లోకములో నాకుండగా
నేను దేనికి భయపడను ||2||
శత్రుసమూహము నన్ను చుట్టినా
సైతనుడు సంహరింపజూసినా ||2||
నా సహవాసిగా నీవుండగా
నేను ఎవరికి భయపడను ||2|| ||ఆకాశమందు||
వ్యాధులు కరువులు శోధనలు
బాధలు దుఃఖము వేదనలు ||2||
మరణము మ్రింగగ కాంక్షించినా
నేను దేనికి భయపడను ||2|| ||ఆకాశమందు||
పడిపోయిన వెనుకంజ వేయక
పశ్చాత్తాపము పడి అడుగు ||2||
నిను క్షమియించును నీ ప్రభువే
నీవు ఎవరికి భయపడకు ||2|| ||ఆకాశమందు||