Aakaasham Nee Simhasanam: Y Sathyavardhan Rao
ఆకాశం నీ సింహాసనం
భూమి నీ పాదపీఠం ||2||
సర్వోన్నతుడా సర్వాధికారి
అందుకో ఇల నా హృదయ వందనం
అల్ఫయు నీవే ఒమేగయు నీవే – ||2||
మార్గము నీవే – జీవము నీవే ||ఆకాశం||
పరలోక తెరపైట తొలగించగా
స్తుతి గీత పాటలు వినిపించగా ||2||
పరిశుద్ద ఆత్ముడు నను తాకగా
రగిలింది నా మనస్సు ఒక జ్వాలగా ||ఆకాశం||
నీ స్వరము ఉరుమై వినిపించగా
అదిరింది నా గుండె ఒకసారిగా ||2||
నీ కిరణాలు మెరుపై నను తాకగా
వెలిగింది నా మనస్సు ఒక జ్యోతిగా ||ఆకాశం||
భువిలోని సృష్ఠంత నీ మాటగా
దివిలోని ఊపిరి నీ శ్వాసగా ||2||
పరలోక రాజ్యానికి నువ్వు దారిగా
వెలిసావు ధరపైన నా యేసుగా ||ఆకాశం||