Asaadyamainadi lene ledu song lyrics :
అసాధ్యమైనది లేనే లేదు
నన్ను బలపరచువాడు నాతో ఉండగా ||2||
ఊహించలేని ఆశ్చర్యక్రియలలో
నా దేవుడు నన్ను నడిపించును ||2||
సాధ్యమే అన్ని సాధ్యమే
నా యేసు తోడైయుండగా ||2||
1. శోధన శ్రమలు వచ్చినను
ఏ మాత్రము నేను వెనుతిరిగినను ||2||
సత్య స్వరూపి సర్వోన్నతుడైన
గొప్ప దేవుడు నన్ను బలపరచును ||2|| ||సాధ్యమే||
2. సాతాను శక్తులు ఎదిరించిన
వాక్యమనే ఖడ్గముతో జయించెదను ||2||
సర్వశక్తుడు తన శక్తితో నింపి
సాతానుపై నాకు జయమిచ్చును ||2|| ||సాధ్యమే||