Amma Kanna Minna song lyrics :
అమ్మ కన్న మిన్న ఓ యేసయ్యా
నాన్న కన్న మిన్న ఓ యేసయ్యా ||2||
నీ ప్రేమ కొదువ లేనిది
ఆ.. ఆ.. నీ కృప అంతము కానిది ||2||
1. ఓ తల్లి తన బిడ్డను మరచునా
వారైనా మరచినా నేను మరువను||2||
అని వాగ్ధానమిచ్చిన నా యేసయ్యా – ||2|| ||నీ ప్రేమ||
2. ఓ తండ్రి తన కుమారుడు చేపనడిగితే
చెప్పాను గాక తండ్రి పామునిచ్చునా ||2||
పరలోకపు తండ్రి వానికంటె శ్రేష్ఠుడె కాదా ||2|| ||నీ ప్రేమ||
3. ఓ తండ్రి తన కుమారుడు రొట్టెనడిగితే
రొట్టెనుగాక తండ్రి రాతినిచ్చునా ||2||
పరలోకపు తండ్రి వానికంటె శ్రేష్ఠుడె కాదా ||2|| ||నీ ప్రేమ||