Anni velala Vinuvaadu song lyrics :
అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు
ఏ బేధము లేకనే ఆలకింపనైయున్నాడు ||2||
ప్రార్ధించుము అలయకనే
కనిపెట్టుము విశ్వాసముతో ||2||
నీ ప్రార్ధనే మార్చును నీ స్థితి
నీ ఎదలో కన్నీరు తుడచును ||అన్ని||
1. కుమిలిపోతూ నలిగిపోతూ
ఏమౌతుందో అర్ధం కాక ||2||
వేదన చెందుతూ నిరాశలో మునిగావా ||2||
ఒకసారి యోచించుమా
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే ||2|| ||అన్ని||
2. ఎవరికీ చెప్పుకోలేక
అంతగా బాధ ఎందుకు ||2||
మొఱ్ఱపెట్టిన వారికి సమీపముగా యేసు ఉండును ||2||
ఒకసారి యోచించుమా
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే ||2|| ||అన్ని||