Anni Naamamula Kanna Song lyrics :
అన్ని నామముల కన్న పై నామము – యేసుని నామము
ఎన్ని తరములకైనా ఘనపరచ దగినది – క్రీస్తేసు నామము ||2||
యేసు నామము జయం జయము
సాతాను శక్తుల్ లయం లయము ||2||
హల్లెలూయ హొసన్న హల్లెలూయా – హల్లెలూయా ఆమెన్ ||2||
1. పాపముల నుండి విడిపించును
యేసుని నామము ||2||
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును
క్రీస్తేసు నామము ||2|| ||యేసు నామము ||
2. సాతాను పై అధికార మిచ్చును
శక్తి గల యేసు నామము ||2||
శత్రు సమూహము పై జయమునిచ్చును
జయశీలుడైన యేసు నామము ||2|| ||యేసు నామము ||
3. స్తుతి ఘన మహిమలు చెల్లించుచు
క్రొత్త కీర్తన పాడెదము ||2||
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో
స్తోత్ర గానము చేయుదము ||2|| ||యేసు నామము ||