Andaala Baaludu song lyrics :
అందాల బాలుడు ఉదయించినాడు
లోకాలు వెలిగించు నీతి సూరీడు (2)
రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను
ప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను (2) ||అందాల||
1. భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసి
ఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి(2)
గొల్లలము మేము కల్లలు ఎరుగము(2)
కళ్లారా జూసాము తేజోమయుని మోము(2) ||రండయ్యో||
2. తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి
లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము(2)
దారి చూపే తార రారాజునే జేర(2)
మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా(2) ||రండయ్యో||
3. తనలోని వెలుగంత పంచేటి పావనుడు
మనలోని పాపమంత తీసేయు రక్షకుడు(2)
చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు(2)
నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు(2) ||రండయ్యో||