Ninnu Choodaga Vacchinaaduraa song lyrics:
నిన్ను చూడగ వచ్చినాడురా దేవ దేవుడు
గొప్ప రక్షణ తెచ్చినాడురా యేసు నాథుడు ||2||
లోకమే సంతోషించగా
ప్రేమనే పంచే క్రీస్తుగా
బెత్లెహేమను ఊరిలో కన్యకు పుట్టినాడురా
పొత్తి గుడ్డల మధ్యలో హాయిగా నిద్దరోయెరా ||నిన్ను||
దేవుని కోపము నుండి
తప్పించే ప్రియ పుత్రుడాయనే ||2||
ముట్టుకో ముద్దు పెట్టుకో ||2|| ||బెత్లెహేమను||
గుండెలో కొలువైయుండి
దీవించే ధనవంతుడాయనే ||2||
ఎత్తుకో బాగా హత్తుకో ||2|| ||బెత్లెహేమను||
తోడుగ వెంటే ఉండి
రక్షించే బలవంతుడాయనే ||2||
చేరుకో నేడే కోరుకో ||2|| ||బెత్లెహేమను||