Naa Sankata Dukhamulella song lyrics:
నా సంకట దుఃఖములెల్ల తీరిపోయెగా
నశింపజేయు దూత నన్ను దాటిపోయెను ||2|| ||నా సంకట||
విలువైన గొర్రెపిల్ల రక్తము ద్వారా ||2||
కలిగియున్న రక్షణలో దాగియుంటిని ||2|| ||నా సంకట||
ఇంకా నేను ఫరోకు దాసుడను కాను ||2||
ఇంకా నేను సీయోను కన్యుడను గాను ||2|| ||నా సంకట||
మార్చబడు నాడు మారా మధురముగా ||2||
పారు జలము బండనుండి త్రాగుచుండును ||2|| ||నా సంకట||
సౌందర్యమయమగు పరమ కానాను ||2||
నా నిత్యమైన స్వాస్థ్యమది మార్పుజెందదు ||2|| ||నా సంకట||
ఆనందమే పరమానందమే ||2||
కానాను జీవితము నా కానందమే ||2|| ||నా సంకట||
నా దేవుడే ఎడారిలో నాదు ప్రభువు ||2||
నా దేవుడిచ్చు క్రొత్త మన్నా నాకు చాలును ||2|| ||నా సంకట||
నా యేసు ప్రభువే నా బలము గానము ||2||
నా యేసు ప్రభువే నా రక్షణ హల్లెలూయా ||2|| ||నా సంకట||