Naa Mano Netramu song lyrics:
నా మనో నేత్రము తెరచి
నా కఠిన హృదయమును మార్చి ||2||
అంధకారములో నేనుండ ||2||
వెదకి నన్ రక్షించితివి ||2|| ||నా మనో||
నే పాప భారము తోడ
చింతించి వగయుచునుంటి ||2||
కల్వరి సిలువలో నా శ్రమలన్ ||2||
పొంది నన్ విడిపించితివి ||2|| ||నా మనో||
ఎన్నాళ్ళు బ్రతికిననేమి
నీకై జీవించెద ప్రభువా ||2||
బాధలు శోధనలు శ్రమలలో ||2||
ఓదార్చి ఆదుకొంటివయా ||2|| ||నా మనో||
నీ సన్నిధిని నే కోరి
నీ సన్నిధిలో నే మారి ||2||
స్తుతి పాత్రగ ఆరాధింతున్ ||2||
యుగయుగములు సర్వ యుగములు ||2|| ||నా మనో||