Naa priyudu yesu song lyrics:
నా ప్రియుడు యేసు – నా ప్రియుడు యేసు
వ్రేలాడే సిలువలో ప్రాణమే బలి చేసెనిల ||2|| ||నా ప్రియుడు||
మెల్లని చల్లని స్వరమే వినబడెను ||2||
తండ్రీ వీరేమి చేయుచున్నారో ||2||
ఎరుగరు గనుక క్షమించుమనెన్
ఆ ప్రియ స్వరమే నా ప్రభు స్వరమే ||నా ప్రియుడు||
అతని ప్రేమ మధురం మధురం
ఎన్నటికీ నే మరువలేను ||2||
ధారబోసెను జీవం – నాకిచ్చె నిత్య జీవం
శాపమంతా బాపి నను దీవించెనుగా ||నా ప్రియుడు||
వీపంతా దున్నబడె నాగలితో
కారె రక్త వరదల్ కనుమా ||2||
యేసు రక్తంలో రక్షణ – యేసు రక్తంలో స్వస్థత
నాకై మరణించి తిరిగి లేచె సజీవునిగా ||నా ప్రియుడు||
తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి
నాకై విన్నతి చేయుచున్నాడు ||2||
రానైయున్నాడు వేగ – మేఘముపై విభుడే
నన్ను పరమ గృహమునకు తోడ్కొని వెళ్ళును ||నా ప్రియుడు||