Naa praana priyuda yesayya song lyrics:
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా
నను గన్న తండ్రి నా యేసయ్యా
పూజింతును ఓ పూజార్హుడా
భజియింతును ఓ భవదీయుడా
నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్యా ||2||
నీవే నీవే నా ప్రాణము
నీవే నీవే నా సర్వము ||నా ప్రాణ||
ఒంటరినై తోడులేక దూరమైతిని
ఓదార్చే వారు లేక భారమైతిని ||2||
తండ్రీ… నీ తోడు లేక మోడునైతిని ||2||
నీ తోడు దొరికాక చిగురించితిని ||2|| ||నీవు గాక||
శత్రువుల చేతులలో చిక్కుకొంటిని
సూటిపోటి మాటలకు నలిగిపోతిని ||2||
తండ్రీ… నీ వైపు నేను చూసిన క్షణమే
కష్టమంతయు తీరిపోయెను
బాధలన్నియు తొలగిపోయెను ||నీవు గాక||
క్షణమైన నీ నామం మరువకుంటిని
మరణమైన మధురంగా ఎంచుకుంటిని ||2||
తండ్రీ… నీవున్నావని బ్రతుకుచుంటిని ||2||
నా కొరకు నీవు నీ కొరకు నేను ||2|| ||నీవు గాక||