Naa devuni krupavalana song lyrics:
నా దేవుని కృపవలన
సమస్తము సమకూడి జరుగును ||2||
నాకు లేమి లేనే లేదు
అపాయమేమియు రానే రాదు ||2|| ||నా దేవుని||
కరువులో కష్టాలలో
ఆయనే నన్ను బలపరుచును ||2||
ఆయనే నన్ను బలపరుచును
ఆయనే నన్ను ఘనపరుచును ||2|| ||నా దేవుని||
శ్రమలలో శోధనలో
ఆయనే నాకు ఆశ్రయము ||2||
ఆయనే నాకు ఆశ్రయము
ఆయనే నాకు అతిశయము ||2|| ||నా దేవుని||
ఇరుకులో ఇబ్బందిలో
ఆయనే నన్ను విడిపించును ||2||
ఆయనే నన్ను విడిపించును
ఆయనే నన్ను నడిపించును ||2|| ||నా దేవుని||