Naadu jeevithamu song lyrics:
నాదు జీవితము మారిపొయినది
నిన్నాశ్రయించిన వేళ
నన్నాదుకుంటివి ప్రభువా ||నాదు||
చాలునయ్యా దేవా – ఈ జన్మ ధాన్యమే ప్రభువా ||2||
పాప కూపము విడిచి – నీ దారి నడచితి దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు||
కన్ను గానని దిశగా – బహు దూరమేగితినయ్యా ||2||
నీ ప్రేమ వాక్యము వినగా – నా కళ్ళు కరిగెను దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు||
లోకమంతా విషమై – నరకాగ్ని జ్వాలలు రేగే ||2||
ఆ దారి నడపక నన్ను – కాపాడినావని దేవా
నిన్నాశ్రయించితి ప్రభువా.. ||నాదు||
జాలిగల నా ప్రభువా – నీ చేయి చాపవా ప్రభువా ||2||
చేరగల నీ దరికి – నే పాపినయ్యా ప్రభువా
నే పాపినయ్యా ప్రభువా.. ||నాదు||
ఆరిపోని జ్యోతివై – కన్నులలోని కాంతివై ||2||
ఎంత కాలముంటివి – ఎంతగా ప్రేమించితివి
నన్నెంతగా ప్రేమించితివి.. ||నాదు||