Naatho neevu maatladinacho song lyrics:
నాతో నీవు మాటాడినచో
నే బ్రతికెదను ప్రభు ||2||
నా ప్రియుడా నా హితుడా
నా ప్రాణ నాథుడా నా రక్షకా ||నాతో||
యుద్ధమందు నేను మిద్దె మీద నుంచి
చూడరాని దృశ్యం కనుల గాంచినాను ||2||
బుద్ధి మీరినాను హద్దు మీరినాను
లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం
ఒక్క మాట చాలు… ఒక్క మాట చాలు
ఒక్క మాట చాలు ప్రభు ||నాతో||
కట్టబడితి నేను గట్టి త్రాళ్లతోను
వీడలేదు ఆత్మ వీడలేదు వ్రతము ||2||
గ్రుడ్డి వాడనైతి గానుగీడ్చుచుంటి
దిక్కు లేక నేను దయను కోరుచుంటి
ఒక్క మాట చాలు… ఒక్క మాట చాలు
ఒక్క మాట చాలు ప్రభు ||నాతో||