Hallelujah Hosanna :
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా పాడెదం
హోసన్నా హోసన్నా హోసన్నా యేసుకే ||హల్లెలూయా||
ప్రేమతో యేతెంచెను పాపమును మోసెను
ప్రాయశ్చిత్తబలిగా ప్రాణమునర్పించెను ||హల్లెలూయా||
మృత్యువును గెలిచెను దుఃఖమును బాపెను
క్రీస్తు గీతం పాడి శ్రీ యేసుని కీర్తింతుము ||హల్లెలూయా||
నిరీక్షణానిచ్చెను నిట్టూర్పు పోగొట్టెను
నిత్యండైన యేసుతో నిశ్చింతగా సాగదన్ ||హల్లెలూయా||
విశ్వాసమూనిచ్చెను విజయము చేకూర్చెను
విశ్వమంత చాటన్ ప్రభు యేసూ వార్తను ||హల్లెలూయా||
అద్భుతమూనిచ్చెను భయమును బాపెను
అభయ హస్తమిచ్చీ ఈ భూమిలో నిల్పెను ||హల్లెలూయా||