Kalvari Girilona Silvalo:
కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు
పలు బాధలొందెను – ఘోరబాధలు పొందెను ||2||
నీ కోసమే అది నా కోసమే ||2||
1. ప్రతివానికి రూపు నిచ్చె
అతనికి రూపు లేదు ||2||
పదివేలలో అతిప్రియుడు
పరిహాసములనొందినాడు ||2|| ||నీ కోసమే||
2. వధ చేయబడు గొర్రెవలె
బదులేమీ పలుకలేదు ||2||
దూషించు వారిని చూచి
దీవించి క్షమియించె చూడు ||2|| ||నీ కోసమే||
3. సాతాను మరణమున్ గెల్చి
పాతాళ మందు గూల్చి ||2||
సజీవుడై లేచినాడు
స్వర్గాన నిను చేర్చినాడు ||2|| ||నీ కోసమే||