కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా ||2||
క్షమాపణ నిన్ను వేడుచున్నాను ||2||
1. దావీదు రాజు దీనుడై వేడ ||2||
అవనిలో బొందిన నష్టములన్నియు ||2||
దేవా నీవు సమకూర్చితివే ||2|| ||కరుణించి||
2. శత్రు సమూహపు కుతంత్రములతో ||2||
బొత్తిగా నేను నష్టపడితిని ||2||
మిత్రుడేసులో సమకూర్చుము తండ్రి ||2|| ||కరుణించి||
3. పసరు గొంగళి – చీడ పురుగులు ||2||
నాశనము చేసిన పంటను కూర్చుమా ||2||
యేసు ప్రభూ నిన్ను వేడుచున్నాను ||2|| ||కరుణించి||
4. ప్రేమ సంతోషానందములను ||2||
ప్రధాన యాజకా పోగొట్టుకొంటిని ||2||
ప్రేమతో నీవు సమకూర్చుమా ||2|| ||కరుణించి||
5. పాపపు విషముతో నా పాత్ర నిండెను ||2||
ప్రభు యేసుండను పిండిని కలుపుము ||2||
పాప మరణమును తొలగించుమా ||2|| ||కరుణించి||
6. ఆత్మీయ సోమరితనములో నుండి ||2||
ఆత్మ నష్టముల నెన్నియో బొందితి ||2||
ఆత్మ దేవా నీవు సమకూర్చుమా ||2|| ||కరుణించి||
7. పాపము చేసి పడియున్న చోటున్ ||2||
ప్రాపుగా నీవు జూపుమో ప్రభువా ||2||
కోపగించక నాపై కృప జూపుమా ||2|| ||కరుణించి||
8. చేసిన పాపము కప్పుకొనక ||2||
విశ్వాసముతో ఒప్పుకొందున్ ||2||
సిలువ రక్తముతో శుద్ధి చేయుమా ||2|| ||కరుణించి||