Kanulundi Chudaleva:
కన్నులుండి చూడలేవ యేసు మహిమను
చెవులుండి వినలేవ యేసు మాటను ||2||
నాలుకుండి పాడలేవ యేసు పాటను
కాళ్ళు ఉండి నడువలేవ యేసు బాటను ||కన్నులుండి||
1. చెడును చూడకుండ నీ కనులను
చెడును వినకుండ నీ చెవులను ||2||
చెడును పలుకకుండ నీ నాలుకన్
చెడులో నడువకుండ నీ కాళ్ళను
దూరముగా నుంచు ఓ సోదరా
దూరముగా నుంచు ఓ సోదరీ ||2|| ||కన్నులుండి||
2. దుష్టుల ఆలోచన చొప్పునా
నడువక సాగుమా నీ యాత్రలో ||2||
పాపుల మార్గమందు నీవు నిలువక
అపహాసకులు కూర్చుండు చోటను
కూర్చుండకుమా ఓ సోదరా
కూర్చుండకుమా ఓ సోదరీ ||2|| ||కన్నులుండి||
3. యెహోవా దొరుకు కాలమందునా
ఆయనను మీరు వెదక రండి ||2||
ఆయన మీ సమీపమందు నుండగా
ఆయననూ మీరు వేడుకొనండి
ఆయన తట్టు తిరుగు ఓ సోదరా
ఆయన తట్టు తిరుగు ఓ సోదరీ ||2|| ||కన్నులుండి||