కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ
మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి
ఎన్ని చేసినా తనువు నమ్మినా
కట్టె మిగిల్చింది కన్నీటి గాధ – ||2|| ||కట్టెలపై||
1. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను
తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని ||2||
కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా
నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా ||2|| ||ఎన్ని చేసినా||
2. ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు
అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు ||2||
కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూ
ఎవ్వరికీ కనిపించక నీ ఆత్మ వెళ్లిపోవును ||2|| ||ఎన్ని చేసినా||