Kraisthavuda Sainikuda: KRajababu
క్రైస్తవుడా సైనికుడా
బలవంతుడా పరిశుద్ధుడా
కదలిరావోయ్ నీవు కదలిరా ||4||
జాలరీ మనుషులు పట్టు జాలరి
ఆత్మలు పట్టు కాపరి
అమృతమందించే ఆచారి
యేసుకై జీవించే పూజారి ||క్రైస్తవుడా||
సిలువే నీ స్థావరము
శ్రమలే నీ సైన్యము ||2||
సహనమే నీ ధైర్యము
వాక్యమే నీ విజయము ||2|| ||క్రైస్తవుడా||
సత్యమే నీ గమ్యము
సమర్పణే నీ శీలము ||2||
యేసే నీ కార్యక్రమం
ప్రేమే నీ పరాక్రమం ||2|| ||క్రైస్తవుడా||
దేశంలో విదేశంలో
గ్రామంలో కుగ్రామంలో ||2||
అడవులలో కొండలలో
పని ఎంతో ఫలమెంతో ||2|| ||క్రైస్తవుడా||
సిద్ధాంతపు గట్టు దుమికి రా
వాగులనే మెట్టును దిగిరా ||2||
దీనుడా ధన్యుడా
విజేయుడా అజేయుడా ||2|| ||క్రైస్తవుడా||
వాగ్ధాన భూమి స్వతంత్రించుకో
అద్వానపు అడవి దాటి ముందుకుపో ||2||
నీ ఇల్లు పెనూయేలు
నీ పేరే ఇశ్రాయేలు ||2|| ||క్రైస్తవుడా||