Kreesthulo Jeevinchu:
క్రీస్తులో జీవించు నాకు – ఎల్లప్పుడు జయముండును
జయముంది జయముంది – జయముంది నాకు ||2||
ఎటువంటి శ్రమలొచ్చినా – నేను దిగులు పడను ఇలలో ||2||
ఎవరేమి చెప్పిననూ – నేను సోలిపోనెప్పుడూ ||2|| ||జయముంది||
నా రాజు ముందున్నాడు – గొప్ప జయముతో వెళ్లుచున్నాడు ||2||
మట్టలను చేత పట్టి – నేను హోసన్నా పాడెదను ||2|| ||జయముంది||
సాతాను అధికారమున్ – నా రాజు తీసివేసెను ||2||
సిలువలో దిగగొట్టి – యేసు కాళ్లతో త్రొక్కి వేసెను ||2|| ||జయముంది||