Christmas Panduga :
క్రిస్మస్ పండుగ వచ్చేనులే నేడు
యేసయ్య జన్మదినం వచ్చేనులే ||2||
ఆనందించెదం నూతన కీర్తన పాడెదం
యేసయ్య ప్రేమను లోకమంతా చాటేడం తెడం
యేసయ్య మార్గములో ఆనందముగా సాగెదం ||2||
కన్యక గర్భములో యేసయ్య జన్మించెను
పశువుల పాకలోనే పరిశుద్ధుడు జన్మించెను
దివినుండి దూతలొచ్చి కొత్త పాటలు పాడెను ||2||
గొల్లలు వచ్చిరి యేసయ్యను చూచిరి
రక్షకుడు పుట్టెనని లోకమంతా చాటిరి ||2|| ||క్రిస్మస్||
దేవుని బహుమానముగా శ్రేష్టుడు భువికొచ్చెను
తన ప్రేమను వెల్లడి చేయ తన ప్రాణం అర్పించెను
సాతాను కట్లన్ని యేసయ్య తెంచెను ||2||
జ్ఞానులు వచ్చిరి యేసయ్యను చూచిరి
బహుమానములిచ్చిరి సాగిలపడి మొక్కిరి ||2|| ||క్రిస్మస్||