Christmas Anandam:
క్రిస్మస్ ఆనందం వచ్చెను మన ఇంటికి
దేవాది దేవుడు వెలసెను ఈ ధరణిలో ||2||
ఆనందము మహదానందము
సంతోషము బహు సంతోషము ||2||
మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్
హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ ||2|| ||క్రిస్మస్||
శోధనలేమైనా – బాధలు ఎన్నైనా
రండి క్రీస్తు నొద్దకు…
రక్షణ ఇచ్చెను – ప్రభువైన యేసు నాథుడు ||2|| ||ఆనందము||
చింతయే నీకున్నా – శాంతియే కరువైనా
రండి క్రీస్తు నొద్దకు…
నెమ్మది ఇచ్చెను – ప్రియమైన దైవ తనయుడు ||2|| ||ఆనందము||