Kshanikamaina Brathukura:
క్షణికమైన బ్రతుకురా ఇది సోదరా
క్షణికమైన సుఖమురా ఇది ||2||
ఓ స్నేహితుడా, ఓ స్నేహితుడా యోచించుమా
సృష్టికర్తను స్మరణ చేయుమా
దైవ ప్రేమను మదిని నిలుపుమా
ఆ యేసు ప్రేమను నీ మదిని నిలుపుమా ||క్షణికమైన||
ఎంత బ్రతికినా ఈ లోకమును విడిచిపెట్టి పోవలెను తెలుసా నీకు ||2||
ఊరికి పోవు త్రోవ యెరుగుమయ్యా ||2||
ఆ త్రొవే యేసని తెలుసుకొనుమయ్యా ||2|| ||ఓ స్నేహితుడా||
గడ్డిపువ్వును పోలిన బ్రతుకు ఎండి పోయి వాడి పోవు తెలుసా నీకు ||2||
ఆవిరివంటి బ్రతుకు ఎగిరిపోవును ||2||
ప్రభు యేసుని నమ్మితే నిత్యజీవము ||2|| ||ఓ స్నేహితుడా||