Kshanamaina Neevu :
క్షణమైన నీవు నను విడచి పోలేదుగా
కనురెప్ప పాటైనా నను మరచి పోలేదుగా ||2||
కునుకక నిదురించక – కనుపాపలా నను కాచియుంటివి ||2|| ||క్షణమైన||
పర్వతములు అన్ని తొలగిపోయినా
నాదు మెట్టలన్ని చెదరిపోయినా ||2||
నా వెన్నంటి నా తట్టు నిలచి
కన్నీటినంతా తొలగించితివి ||2||
నీ కృప నను విడిచిపోలేదు
నీ సన్నిధి నాకు దూరపరచలేదు ||2|| ||క్షణమైన||
శోధనలు నన్ను చుట్టుముట్టినా
శ్రమలే నన్ను కృంగదీసినా ||2||
నా తండ్రివై నా తోడుగా నిలచి
నా భారములన్ని తొలగించితివే ||2||
నీ కృప నను విడిచిపోలేదు
నీ సన్నిధి నాకు దూరపరచలేదు ||2|| ||క్షణమైన||