O Maanavaa song lyrics :
ఓ మానవా.. నిజమేదో ఎరుగవా
ఓ మానవా.. ఇకనైనా మారవా
మన పాపములను క్షమియించుటకే
సిలువ మరణము పొందెనని ||2||
గ్రహియించి నేడు – ఆ యేసు ప్రభుని వేడు ||2||
ఈ దినమే అనుకూలం…
లేదిక వేరే ఏ సమయం ||2||
నిజమేదో తెలియకనే
చనిపోతే నీ గతి ఏమి? ||2|| ||ఓ మానవా||
సిలువను గూర్చిన శుభ వార్త
వెర్రితనముగా ఉన్నదా?
దేవుని శక్తని తెలుసుకొని
ప్రభు మార్గమును చేరెదవా ||2|| ||ఈ దినమే||
ప్రయాసముతో భారము మోసే
నిన్నే దేవుడు పిలిచెనుగా
ప్రయత్నము వీడి విశ్రాంతిని పొంద
వేగిరమే పరుగిడి రావా ||2|| ||ఈ దినమే||
నీ ధనము నీ ఘనము
నీ సర్వస్వము చితి వరకే
అర్పించుము నీ హృదయమును
(నిజ) రక్షకుడైన ప్రభు కొరకే ||2|| ||ఈ దినమే||