ఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా
ఏ అర్హతా లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా
నీకేమి చెల్లింతును
నీ ఋణమెలా తీర్తును ||2|| ||ఏ యోగ్యతా||
కలుషితుడైన పాపాత్ముడను
నిష్కళంకముగా నను మార్చుటకు ||2||
పావన దేహంలో గాయాలు పొంది ||2||
రక్తమంత చిందించినావా ||నీకేమి||
సుందరమైన నీ రూపమును
మంటివాడనైన నాకీయుటకు ||2||
వస్త్రహీనుడుగా సిలువలో వ్రేళాడి ||2||
నీ సొగసును కోల్పోయినావా ||నీకేమి||
పాపము వలన మృతినొందిన
అపరాధినైన నను లేపుటకు ||2||
నా స్థానమందు నా శిక్ష భరించి ||2||
మరణించి తిరిగి లేచావా ||నీకేమి||