ఏపాటి దాననయా నన్నింతగ హెచ్చించుటకు
నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు ||2||
నా దోషము భరియించి నా పాపము క్షమియించి
నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ||2||
ప్రేమించే ప్రేమామయుడా – నీ ప్రేమకు పరిమితులేవి
కృప చూపు కృపగల దేవా – నీ కృపకు సాటి ఏది ||ఏపాటి||
కష్టాల కడలిలో కన్నీటి లోయలలో
నా తోడు నిలిచావు నన్నాదరించావు ||2||
అందరు నను విడచినా నను విడువని యేసయ్యా
విడువను యెడబాయనని నా తోడై నిలచితివా ||ప్రేమించే||
నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా
నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా ||2||
నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా
నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ||ప్రేమించే||