Ye Bhayamu Naaku: Pastor Vinod Kumar
ఏ భయము నాకు లేనేలేదుగా నీవు తోడుండగా
ఏ దిగులు నాకు లేనేలేదుగా నీ కృప నా తోడుండగా||2||
ఎంత లోతున పడిపోయిన పైకెత్తగల సర్వశక్తుడా
పగిలి పోయిన ప్రతీ పాత్రను సరి చేయగల పరమకుమ్మరి ||2||
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..||2||
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా ||2||
1.గొర్రెల కాపరి అయిన దావీదున్ – నీవు రాజుగా చేసినావుగా
గొలియాతును పడగొట్టుటకు – నీ బలమునే ఇచ్చినావైయ్యా ||2||
ప్రతి బలహీన – సమయములో – నీ బలము నా తోనుండగా
భయపడక ధైర్యముతో నే ముందుకే సాగెద ||2||
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..||2||
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా ||2||
2.ఘోరపాపి అయిన రాహాబున్ – నీవు ప్రేమించినావుగా
వేశ్యగా జీవించినను – వారసత్వమునిచ్చినావుగా ||2||
నా పాపమై – నా శాపమై – మరణించిన నా యేసయ్య
నా నీతియై – నిత్య శాంతియై – నా తోడుండు నా దైవమా ||2||
ఆరాధన ఆరాధన ఆ..రా..ధన..||2||
ఆరాధన ఆరాధన ఆరాధన నీకేనయ్యా ||2||