Enduko Ee Prema Song lyrics :
ఎందుకో ఈ ప్రేమ నన్నింతగ ప్రేమించెను
ఎందుకో ఈ జాలి నాపై కురిపించెను ||2||
ఏ యోగ్యత లేని ఓటి కుండను
నీ పాత్రగ చేసి ఎన్నుకుంటివి ||2||
ఎనలేని కృపనిచ్చితివి ||ఎందుకో||
1. నీ సన్నిధి పలుమార్లు నే వీడినానే
అయినా నీవు క్షమియించినావే
ఊహించని మేలులతో దీవించినావే
నా సంకటములను కదా తీర్చినవే ||2||
ఏ యోగ్యత లేని దీనుడను
ఏమివ్వగలను నీ ప్రేమకు
(నా) సర్వం నీకే అర్పింతును – ||2|| ||ఎందుకో||
2. మా కొరకు బలి పశువై మరణించినావు
మా పాప శిక్ష తొలగించినావు
పలు విధముల శోధనలో తోడైనావు
ఏ కీడు రాకుండ మేము కాచినావు ||2||
రుచి చూపినావు నీ ప్రేమను
ఆ ప్రేమలో నేను జీవింతును
నీవే నాకు ఆధారము – ||2|| ||ఎందుకో||