Entho Sundarudamma song lyrics : M Prashanth Raju
ఎంతో సుందరుడమ్మ తాను…
ఎంతో సుందరుడమ్మ తాను
నేనెంతో మురిసిపోయినాను ||2|| ||ఎంతో||
1. ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు ||2||
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు ||2||
ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు – ||2||
ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు ||2||
అవలీలగా నతని గురితింపగలనమ్మా ||2|| ||ఎంతో||
2. కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు ||2||
మరులు మనసున నింపు మహనీయుడాతండు ||2||
కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు
మరులు మనసున నింపు మహనీయుడాతండు – ||2||
సిరులు కురిపించేను వర దేవ తనయుండు ||2||
విరబూయు పరలోక షారోను విరజాజి ||2|| ||ఎంతో||
3. పాలతో కడిగిన నయనాలు గలవాడు ||2||
విలువగు రతనాల వలె పొదిగిన కనులు ||2||
పాలతో కడిగిన నయనాలు గలవాడు
విలువగు రతనాల వలె పొదిగిన కనులు – ||2||
కలుషము కడిగిన కమలాల కనుదోయి ||2||
విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు ||2|| ||ఎంతో||
4. మేలిమి బంగారు స్థలమందు నిలిపిన ||2||
చలువ రాతిని బోలు బలమైన పాదాలు ||2||
మేలిమి బంగారు స్థలమందు నిలిచినా
చలువ రాతిని బోలు బలమైన పాదాలు – ||2||
ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. ||2||
బలవంతుడగువాడు బహుప్రియుడాతండు ||2|| ||ఎంతో||
5. అతడతికాంక్షానీయుండు తనయుండు ||2||
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు ||2||
అతడతికాంక్షానీయుండు తనయుండు
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు – ||2||
ఆతని నొరతి మధురంబు మధురంబు ||2||
ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస ||2|| ||ఎంతో||