Entho Bhagyambu Song lyrics:
ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెను
మనకెంతో భాగ్యంబు
వింతైన తన మహిమనంత విడచి మన కొరకై
చింతలన్నియు బాపుటకెంతో దీనుడాయె ||ఎంతో||
1. పరలోకమును విడచి మనుజ కుమారుడయ్యె
నరుల బాంధవుడయ్యా కరుణా సముద్రుండు ||ఎంతో||
2. బాలుడయ్య తన జనకుని – పని నెరిగిన వాడయ్యే
ఈ లోకపు జననీ జనకులకెంతో లోబడనే ||ఎంతో||
3. పెరిగెను జ్ఞానమందు – మరియు దేహ బలమందు
పరమేశుని దయయందు నరుల కనికరమందు ||ఎంతో||