ఎవరూ సమీపించలేని
తేజస్సుతో నివసించు నా యేసయ్యా ||2||
నీ మహిమను ధరించిన పరిశుద్ధులు
నా కంటబడగానే ||2||
ఏమౌదునో నేనేమౌదునో ||2||
ఇహలోక బంధాలు మరచి
నీ యెదుటే నేను నిలిచి ||2||
నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి
నిత్యానందముతో పరవశించు వేళ ||2|| ||ఏమౌదునో||
పరలోక మహిమను తలచి
నీ పాద పద్మములపై ఒరిగి ||2||
పరలోక సైన్య సమూహాలతో కలసి
నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ ||2|| ||ఏమౌదునో||
జయించిన వారితో కలిసి
నీ సింహాసనము నే చేరగా ||2||
ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో
నిత్య మహిమలో నను పిలిచే ఆ శుభ వేళ ||2|| ||ఏమౌదునో||