ఎవరికి ఎవరు ఈ లోకంలో
చివరికి యేసే పరలోకంలో ||2|| ||ఎవరికి||
ఎవరెవరో ఎదురౌతుంటారు
ప్రాణానికి నా ప్రాణం అంటారు ||2||
కష్టాలలో వారు కదిలి పోతారు
కరుణగల యేసు నాతో ఉంటాడు ||2|| ||ఎవరికి||
ధనము నీకుంటే అందరు వస్తారు
దరిద్రుడవైతే దరికెవ్వరు రారు ||2||
ఎవరిని నమ్మిన ఫలితము లేదురా
యేసుని నమ్మితే మోక్షం ఉందిరా ||2|| ||ఎవరికి||
మనుషుల సాయం వ్యర్ధమురా
రాజుల నమ్మిన వ్యర్ధమురా ||2||
యెహోవాను ఆశ్రయించుట
ఎంత మేలు.. ఎంతో మేలు ||2|| ||ఎవరికి||