ఊహలు నాదు ఊటలు
నా యేసు రాజా నీలోనే యున్నవి ||2||
ఊహకందని నీదు ఆశ్చర్య క్రియలు ||2|| ||ఊహలు||
నీదు కుడి చేతిలోన
నిత్యము వెలుగు తారగా ||2||
నిత్య సంకల్పము
నాలో నెరవేర్చుచున్నావు ||2|| ||ఊహలు||
శత్రువులు పూడ్చిన
ఊటలన్నియు త్రవ్వగా ||2||
జలలు గల ఊటలు
ఇస్సాకునకు ఇచ్చినావు ||2|| ||ఊహలు||
ఊరు మంచిదే గాని
ఊటలన్నియు చెడిపోయెనే ||2||
ఉప్పు వేసిన వెంటనే
ఊట అక్షయత నొందెనే ||2|| ||ఊహలు||