Uruko Naa Pranamaa:
ఊరుకో నా ప్రాణమా కలత చెందకు
ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా ||2||
ఎడారి దారిలోన – కన్నీటి లోయలోన ||2||
నా పక్షమందు నిలిచే నా ముందురే నడిచే
నీ శక్తినే చాట నన్నుంచెనే చోట
నిన్నెరుగుటే మా ధనం
ఆరాధనే మా ఆయుధం
ఎర్రసముద్రాలు నా ముందు పొర్లుచున్నా
ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్నా ||2||
నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా
నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా ||2|| ||ఊరుకో||
ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణుడు
అన్యాయము చేయుట అసంభవమేగా ||2||
వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు
దుష్కార్యము చేయుట అసంభవమేగా ||2|| ||ఊరుకో||
అవరోధాలెన్నో నా చుట్టు అలుముకున్నా
అవరోధాల్లోనే అవకాశాలను దాచెగా ||2||
యెహోవా సెలవిచ్చిన ఒక్కమాటయైనను
చరిత్రలో ఎన్నటికీ తప్పియుండలేదుగా ||2|| ||ఊరుకో||