ఉన్నాడు దేవుడు నాకు తోడు
విడనాడడెన్నడు ఎడబాయడు ||2||
కష్టాలలోన నష్టాలలోన
వేదనలోన శోధనలోన ||ఉన్నాడు||
గాఢాంధకారములో సంచరించినా
కన్నీటి లోయలో మునిగి తేలినా ||2||
కరుణ లేని లోకము కాదన్ననూ ||2||
కన్నీరు తుడుచును నను కొన్నవాడు ||ఉన్నాడు||
యెహోవ సన్నిధిలో నివసింతును
చిరకాలమాయనతో సంతసింతును ||2||
కృపా మధుర క్షేమములే నా వెంటె ఉండును ||2||
బ్రతుకు కాలమంతయు హర్షింతును ||ఉన్నాడు||