ఉన్నత స్థలములలో – నను సదా నిలిపితివి
నా శ్రమ దినములలో – కృపలతో కాచితివి ||2||
స్తుతులకు పాత్రుడా నన్ను మరువని దేవుడా
మహిమ నీకేనయ్యా ఎన్నడూ మారని యేసయ్యా ||2||
ఆది కాలమందే నాకు ఎప్పుడో పేరు పెట్టి
తల్లి గర్భమందె నన్ను ఆనవాలు పట్టి ||2||
నన్ను ఏర్పరచిన నీదు రక్షణతో నింపిన
లేని అర్హతలను నాకు వరముగా చేసిన ||2|| దేవా ||ఉన్నత||
కలుగు ఏ శోధన నన్ను నలుగ గొట్టకుండా
నీదు మార్గంబులో నేను వెనుక తిరుగకుండా ||2||
శుద్ధ ఆత్మనిచ్చి నాకు మార్గములు చూపిన
హీనమైన నన్ను నీలో దృఢముగా మార్చిన ||2|| దేవా ||ఉన్నత||
గాఢాంధకారపు లోయలో నేను కొనసాగినా
పదివేల జనములు నా కుడి ప్రక్కనే కూలినా ||2||
నేను భయపడనుగా నీవే ఉంటె ఆశ్రయముగా
ఏ తెగులు రాదుగా నాదు గృహమును చేరగా ||2|| దేవా ||ఉన్నత||